మేషం

మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు.
శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం

మొదలు పెట్టిన కార్యాలను తోటి వారి సహకారంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

మిధునం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.

కర్కాటకం

చేపట్టే పనిలో శ్రమ పెరిగినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుపోవాలి అనవసర విషయాలపట్ల సమయాన్ని వృథాచేయకండి, ఈశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం

మీ శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఇష్టదైవారాధన శుభం.

కన్య

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతవరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయినవారితో జాగ్రత్త. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న వస్తువులను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

వృశ్చికం

మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. చేపట్టే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

చేసిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.

మకరం

శుభసమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. ఆంజనేయ సందర్శనం మంచిది.

కుంభం

మీ రంగాల్లో శ్రమ పెరిగినప్పటికీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రులు సహకారం ఉంటుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. దుర్గ దేవి స్తుతి శుభప్రదం.

మీనం

ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)