కమనీయం… రమణీయం సీతారాముల కళ్యాణం

భక్తుల కోలాహలం మద్య రాములోరి… పెళ్లి వేడుకలు

జగిత్యాల జిల్లా

అంతా రామమయం.. జగమంతా రామమయం అన్న చందంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలను భక్తి, శ్రద్ధలతో జరుకున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొండగట్టు ఆలయంతో పాటు ధర్మపురి, జగిత్యాల సమీపంలోని చిన్నగట్టు ఆంజనేయస్వామి ఆలయం, జిల్లాలోని జగిత్యాల విద్యానగర్, ధరూర్ క్యాంప్, మార్కండేయ ఆలయం, బుగ్గారం మండలం చందయ్యపల్లె హనుమాన్ ఆలయం, పెగడపల్లి, దొంతాపూర్, వెల్దుర్తి,లక్ష్మీపూర్, రాయికల్,బతికేపల్లి, కోరుట్ల తదితర ఆలయాల్లో శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కళ్యాణo వైభవంగా జరిగింది.

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్, లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డు వద్ద చిన్నగట్టుపై వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారాముల కళ్యాణన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చిట్ల అంజన్న- లత, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ దిక్షా పరులు, వేలాదిమంది భక్తుల కోలాహలం మధ్య సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు నంబీ విజయసారథి ప్రవేక్షణలో అర్చకులు శరత్ లు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం చిన్నగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుండి అమ్మవారు,స్వామి వారల ఉత్సవమూర్థులను డప్పు చప్పుళ్లు, మేళా తాళాలమధ్య భక్తులు పల్లకిలో ఊరేగింపుగా అందంగా అలంకరించిన వేదికపై తీసుకొచ్చారు. భక్తుల జయ జయ ధ్వనాల మద్య అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణo కన్నులపండువగా జరిగింది.

చిన్న గట్టు ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ పక్షాన తలంబ్రాలు, స్వామి, సీతమ్మకు పట్టు వస్త్రాలు, పుస్తె, మట్టెలు చిట్ల అంజన్న – లత దంపతులు సమర్పించారు. వేద పండితులు సుమారు రెండు గంటలపాటు రాములోరి పెళ్లి తంతును జరిపించారు. భక్తుల రామనామస్మరణతో చిన్న గట్టు ప్రాంతం మారుమ్రోగింది. వేసవికాలం దృష్ట్యా గుట్టపైన భక్తులకోసం చలువ పందిల్లు వేయడంతో పాటు తాగునీటి వసతిని కల్పించారు.
భక్తులు అధికసంఖ్యలో హాజరై రాములోరి కళ్యాణన్ని తిలకించారు.రాత్రి స్వామివారి శోభయాత్రను అంజన్నదిక్షా స్వాములు, భక్తులు వైభవంగా నిర్వహించారు.

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి చిన్నగట్టు ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు గోత్రనామాధులతో అర్చన చేసి ఆశీర్వాదీంచగా జీవన్ రెడ్డినీ ఆలయాకమిటి సన్మానించారు. కళ్యాణనికి హాజరైన భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు భోజనవసతి కల్పించారు.

ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్, కౌన్సిలర్లు కూసరి అనిల్, చుక్క నవీన్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీ దేవెందర్ రెడ్డి, బండారి నరేందర్, బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, కొత్త మోహన్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, కొప్పేర వెంకట్ రెడ్డి, మామిడి రాజిరెడ్డి, చిట్ల శంకర్,మాజీ కౌన్సిలర్లు అల్లాల సరిత, పిప్పరి అనిత, టీ.రోహిత రెడ్డి, డాక్టర్.గురువారెడ్డి, డాక్టర్. మల్లారెడ్డి, చిట్ల రవీందర్, పిట్ట లింగారెడ్డి, మునిందర్ రెడ్డి, పుప్పాల అశోక్, పరీక్షిత్ రెడ్డి, నారాయణరెడ్డి, లింబాద్రి, కొక్కు గంగాధర్,జంగిలి చంద్రమౌళి, చిట్ల శ్రీనివాస్, వేముల కేశవ రెడ్డి, దేవెందర్ రెడ్డి చుట్టు ప్రకక్కల గ్రామాలనుండి వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.