మేషం

బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ
కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృషభం

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది . కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం ..

మిధునం

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

కర్కాటకం

ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు . శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

సింహం

ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు . శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో
జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో ప్రారంభంలో ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల

చేసిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమచేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయం తీసుకోవడంలో తడబడతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.

వృశ్చికం

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు
లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి.
బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది . సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

ధనుస్సు

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. విష్ణు నామాన్ని జపించాలి.

మకరం

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

కుంభం

మిశ్రమకాలం. చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ లేకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గా స్తోత్రం పఠించడం మంచిది.

మీనం

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాలికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)