అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి – ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
అంబెడ్కర్ కు పాత్రికేయుల ఘన నివాళి
జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 14,2023

జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తహశీల్ చౌరస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు లత, మంద మకరంద్, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు టీవీ సూర్యం తదితరులు లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, అధికారులు, కుల సంఘాల నాయకులు,తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అనిల్, మల్లికార్జున్, నవీన్, శ్రీకాంత్, జగదీశ్వర్, బాల ముకుందం, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ బోనగిరి నరేష్, ఎస్సి కార్పొరేషన్ ఏడి కుందారపు లక్ష్మీనారాయణ, వార్డెన్ వెంకట్ రెడ్డి,మున్సిపల్ డిఈ రాజేశ్వర్ ఇతర అధికారులు పూలమాల వేసి అంబేద్కర్ కు నివాళులర్పించారు.

బీజేపీ నాయకులు సత్యనారాయణ రావు, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి, డాక్టర్.ఎడమల శైలెందర్ రెడ్డి, చిలకమర్రి మదన్మోహన్, నక్క జీవన్, వివిధ సంఘాల నాయకులు బండ శంకర్, బాలే శంకర్, కాయిత శంకర్, గంగారాం, మహేష్,మద్దెల నారాయణ, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు భోగ శశిధర్, వకీల్,తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్ లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించగా ఇందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు విజయలక్ష్మి దేవెందర్ రెడ్డి, గిరి నాగభూషణం, మన్సూర్, గాజుల రాజేందర్, అల్లాల రమేష్ రావు, పుప్పాల అశోక్, చిట్ల అంజన్న, నేహాల్, పులి రామ్, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్, బతికేపల్లి, మోతే, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి, గొల్లపల్లి, సారంగాపూర్, కొడిమ్యాల, మల్యాల, బుగ్గారం, పెగడపల్లి, వెల్గటూరు, బీర్పూర్ మండలాల్లో ఎంపిపి, జెడ్పిటిసిల తోపాటు వివిధ గ్రామాల్లో సర్పంచ్ లు, ఎంపిటిసిలు, సామజిక సేవకురాళ్లు టీ. దీపిక రెడ్డి, బొడ్డు వనిత, మహిళా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపున్నారు.

జగిత్యాల పాత్రికేయుల ఆధ్వర్యంలో …..
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, దళిత బహుజన, బలహీన వర్గాల వికాసానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి జగిత్యాల పాత్రికేయులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
అసంఘటిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబాసాహెబ్ అంబేడ్కర్ రిజర్వేషన్లు కల్పించారని, అంబేడ్కర్ ఆశయాలను పూర్తి స్థాయిలో సాధించడానికి మీడియా కృషి ప్రధానమన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, తోటి పాత్రికేయులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి, తోట హన్మంతు, ఆనంతుల కాంతారావు, నర్రా రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బిసి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, రాపర్తి రవి,నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు.
ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.