ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: సప్తమి రా.10:32 వరకు
తదుపరి అష్టమి
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: విశాఖ రా.తె.05:32 వరకు
తదుపరి అనూరాధ
యోగం: బ్రహ్మ రా.09:34 వరకు
తదుపరి ఐంద్ర
కరణం: గరజ ఉ.10:35 వరకు
తదుపరి వణిజ రా.10:32 వరకు
తదుపరి
వర్జ్యం: ఉ.10:48 – 12:25 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:53 – 12:44
రాహు కాలం: ప.12:18 – 01:53
గుళిక కాలం: ఉ.10:44 – 12:18
యమ గండం: ఉ.07:35 – 09:09
అభిజిత్: 11:53 – 12:43
సూర్యోదయం: 06:00
సూర్యాస్తమయం: 06:36
చంద్రోదయం: ఉ.11:26
చంద్రాస్తమయం: రా.10:57
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: ఉత్తరం
అవ్యంగ సప్తమి
భాస్కర పవిత్రారోపణం
శీతలా సప్తమి
సంత్ తులసీదాస్ జయన్తీ
బుధ – బృహస్పతి పూజ
ద్వాదశ సప్తమి
సూర్య పూజ
శ్రీ సత్యవరతీర్థ పుణ్యతిథి
నేటి రాశి ఫలాలు
మేషం
ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
వృషభం
ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
మిధునం
లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబసభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు
కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
కర్కాటకం
మీలోని నిబద్ధతే మిమ్మల్ని రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తున్నాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
సింహం
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.
కన్య
మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీదత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
తుల
మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మనఃస్సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
వృశ్చికం
బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
ధనుస్సు
పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటి వారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
మకరం
పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గ్యానం శుభప్రదం.
కుంభం
తోటివారితో కలిసి చేసే పనుల్లో సమన్వయలోపం చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. సమర్థతను పెంచాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించాలి.
మీనం
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)