తెలంగాణ లో 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

అత్యధికంగా నల్గొండ జిల్లాకు 91, అతి తక్కువగా సిరిసిల్ల జిల్లాకు 20 మంజూరు చేయడం జరిగింది.

రాష్ట్రంలోని రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు 1523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ కొలువులను పాఠశాల విద్యాశాఖ నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) ద్వారా భర్తీ చేస్తామని తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ప్రాథమిక పాఠశాలల్లో 796, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 727 కొలువులను మంజూరు చేశారు.

అయితే జిల్లాల వారీగా ఈ పోస్టుల వివరాలు…

హైదరాబాద్‌ 54,
రంగారెడ్డి 78,
మేడ్చల్‌ 30,
కామారెడ్డి 72,
నిజామాబాద్‌ 69,
నిర్మల్‌ 40,
సూర్యాపేట 74,
సంగారెడ్డి 65,
నాగర్‌కర్నూల్‌ 84,
కొత్తగూడెం 56,
ఖమ్మం 56,
యాదాద్రి 55,
మెదక్‌ 53,
సిద్దిపేట 52,
వికారాబాద్‌ 49, మహబూబ్‌నగర్‌ 43,
జగిత్యాల 39,
కరీంనగర్‌ 30,
ఆదిలాబాద్‌ 38,
జనగామ 38,
వరంగల్‌ 37,
మహబూబాబాద్‌ 36,
వనపర్తి 36,
మంచిర్యాల 34,
గద్వాల 31,
నారాయణపేట 31,
హన్మకొండ 30,
పెద్దపల్లి 27,
ఆసిఫాబాద్‌ 26,
భూపాలపల్లి 25,
ములుగు 24.