ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: నిజశ్రావణ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: త్రయోదశి ప‌.01:13 వరకు
తదుపరి చతుర్దశి

వారం: మంగళవారం – భౌమవాసరే

నక్షత్రం: శ్రవణం రా.12:03 వరకు
తదుపరి ధనిష్ఠ

యోగం: సౌభాగ్య ఉ‌.06:02 వరకు
తదుపరి శోభన రా.01:46 వరకు
తదుపరి అతిగండ

కరణం: తైతుల ప‌.01:13 వరకు
తదుపరి గరజ‌ రా.12:11 వరకు
తదుపరి వణిజ

వర్జ్యం: ఉ‌.పూ.05:13 – 06:44 వరకు
మరియు రా.తె.03:47 – 05:16 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:32 – 09:22
మరియు రా.11:05 – 11:51 వరకు

రాహు కాలం: ప‌.03:24 – 04:59

గుళిక కాలం: ప‌.12:17 – 01:50

యమ గండం: ఉ‌.09:09 – 10:43

అభిజిత్: 11:52 – 12:42

సూర్యోదయం: 06:01

సూర్యాస్తమయం: 06:32

చంద్రోదయం: సా.05:25

చంద్రాస్తమయం: రా.తె.03:50

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మకరం

దిశ శూల: ఉత్తరం

వరాహజయన్తీ‌

తిరుఓనం‌

ఋక్ – అశ్వలాయన ఉపాకర్మ

సంత్‌ నరహరి మహారాజ్ జయన్తీ

శివ పవిత్రారోపణం‌

మంగళగౌరీ వ్రతం

విష్ణు పంచకోపవాసము

శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన
సప్తరాత్రోత్సవారంభం‌

శ్రవణోపవాసము‌

సంత్ జిష్ణేశ్వర్‌ జయన్తీ

తెలుగు భాష దినోత్సవం

శ్రీ గిడుగు వెంకట రామమూర్తి
జన్మదినం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవ‌ సమాప్తి

ద్వారకా తిరుమల
పవిత్రోత్సవారంభం‌


నేటి రాశి ఫలాలు


మేషం

ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్య భంగం. ఆలోచనల స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం

ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టు-బడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల సమయం.

మిథునం

పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం

కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తివివాదాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కన్య

కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. పదవీయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

తుల

కొన్నిపనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మికచింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. చిత్రమైన సంఘటనలు.

వృశ్చికం

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి, విందు వినోదాలు. కార్యజయం.

ధనుస్సు

రుణదాతల ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం

చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీ- పరీక్షల్లో విజయం. భూ, వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టేక్కుతారు.

కుంభం

పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు తప్పకపోవచ్చు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)