ఆటోపై చెట్టు కూలిపోవడంతో ఆటో డ్రైవర్ మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదర్‌గూడ ఓల్డ్‌ ఎమ్మెల్యే కాలనీలో భారీ వృక్షం కుప్ప కూలింది. సిగ్నల్‌ వద్ద నిలిచిన రెండు ఆటోలపై ఒక్కసారిగా పడింది. దీంతో ఓ ఆటో డ్రైవర్‌ మృతి చెందారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ కాసేపు నిలిచిపోయింది.