కొన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రిక్రూట్ మెంట్ విషయంలో రాష్ట్రాల పరిధిలో సర్టిఫికేట్లలో ఆధార్ సంఖ్య అనేది తప్పనిసరిగా మారిన నేపద్యంలో… విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పై విద్యార్థుల ఆధార్ నంబర్ ను ముద్రించవద్దని యూజీసీ యూనివర్సిటీలను ఆదేశించింది.

ఇది సరికాదని వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని యూజీసీ చెప్పింది. బదులుగా, అన్ని వర్సిటీలు యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని యూజీఎసీ సెక్రటరీ మనీష్ జోషి యూనివర్సిటీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

స్టూడెంట్స్ పర్సనల్ డేటా పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.