ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు
నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం:

తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ఏదైనా చెప్పడం సులభం. అయితే మూర్ఖునికి ఏదైనా మంచి చెప్పడం ఎవరి తరం కాదు. ఏరుకు ఉండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.