మేషం

మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. చతుర్ధ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం. చంద్రశ్లోకం చదువుకోవాలి.

వృషభం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శివారాధన శుభప్రదం.

మిధునం

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా
వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనవసర విషయాలలో తలదూర్చకండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కర్కాటకం

శుభకాలం. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా
ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

సింహం

ప్రారంభించిన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గోసే చేస్తే బాగుంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకోవాలి.

కన్య

చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ధర్మసిద్ధి ఉంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

తుల

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

ధనుస్సు

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం
చదవాలి.

మకరం

దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రులు సహకారం ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభదాయకం.

కుంభం

దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. సాయిబాబ సందర్శనం శుభప్రదం.

మీనం

ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)