మేషం
మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సూర్యభగవానుని దర్శనం ఉత్తమం
వృషభం
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ
చేస్తే మంచిది.
మిధునం
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. బద్ధకాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. శివాష్టోత్తరం చదివితే మంచిది.
కర్కాటకం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంజనేయ దర్శనం శుభప్రదం.
సింహం
ప్రయత్నాలు నెరవేరుతాయి. పట్టుదలతో పనిచేయండి. శుభఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుతారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ ప్రతిభకు గౌరవ సన్మానాలను పొందుతారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.
కన్య
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము పారాయణ మంచిది.
తుల
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన శుభఫలితాలను పొందగలుగుతారు.
వృశ్చికం
అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది.
శ్రీఆంజనేయుడిని ఆరాధించాలి.
ధనుస్సు
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఈశ్వరారాధన శుభప్రదం.
మకరం
మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.
కుంభం
అభివృద్ధికి సంబంధించి అంశాల్లో ముందడుగు వేస్తారు. ధనయోగం ఉంది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్య వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మీనం
ధన, ధాన్య లాభాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. వాణిజ్య రంగంలో వారికి కీలకమైనవి వస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. శ్రీహయగ్రీవ స్తోత్రం చదివితే మంచిది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)