జగిత్యాల జిల్లా
మార్చి 18

ఇటీవలే మృతిచెందిన ఆధ్యాత్మిక పరురాలు వేముల లలితమ్మ కుటుంబాన్ని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు. ధర్మపురి మండలం తీగేలాధర్మారం గ్రామానికి చెందిన గీతాశ్రమనిర్వాహకులు వేముల రాజిరెడ్డి భార్య లలితమ్మ 10 రోజుల క్రితం ఆకస్మాత్తుగా మృతి చెందిన విషయాన్నీ తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం రాజిరెడ్డి ఇంటికీ వెళ్లి ఆయనతో పాటు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కుమారులైన బాపురెడ్డి, రాంరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి లను జీవన్ రెడ్డి ఓదార్చారు. అలాగే జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఎమ్మెల్సీ వెంట బీర్పూర్ ఎంపిపి మసర్థి రమేష్, నర్సయ్య, జంగిలి ప్రభాకర్, కమలాకర్ రావు, సింహారాజు ప్రసాద్, వెంకట్ రెడ్డి, కేశవరెడ్డి, వెంకట నర్సిoహ్మారెడ్డి తదితరులున్నారు.