జగిత్యాల జిల్లా కేంద్రం
మార్చి 20, 2023

ప్రజా సమస్యలను వెలికి తీసి పరిస్కారానికి కృషి చేస్తున్న “క్యూ న్యూస్” కార్యాలయంపై దాడిచేయ డాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరునగరి శ్రీనివాస్ లు కోరారు.

ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా వార్త ప్రసారసాధనాలు పనిచేస్తున్నాయని అటువంటి ప్రసారసాధనల కార్యాలయాలపై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి శ్రీనివాస్ లు సోమవారం ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న తీన్మార్ మల్లన్న ప్రజాధారణ పొందుతున్నాడని అక్కసు పెంచుకున్న కొందరు వ్యక్తులు కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేయడం పత్రిక స్వేచ్ఛను కాలరాయాడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగంలో వార్త ప్రసారసాధనాలకు గౌరవం ఉందని ఫోర్త్ ఎస్టేట్ గా భావించే వార్త ప్రసారసాధనలను ఆగౌరవపరిచేవిధంగా దాడులకు పాల్పడడం క్షమించరానిదన్నారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి, శ్రీనివాస్ లు అన్నారు.