బ్రాహ్మణులు సమాజానికి మార్గదర్శకులు – మాజీ ఎమ్మెల్యే కట్కo మృత్యుంజయం

జగిత్యాల జిల్లా కేంద్రం
మార్చి 19,2023


బ్రాహ్మణులూ ఏకాకికారని వారు సమాజానికి మార్గదర్శకులని కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కట్కo మృత్యుంజయం అన్నారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జగిత్యాల పట్టణంలోని గీతా భవన్ లో బ్రాహ్మణ సంఘo నాయకులు, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, ప్రముఖ జ్యోతి, వాస్తు శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబీ వేణుగోపాలా చార్య కౌశిక,
జగిత్యాల రూరల్ ఎంపిపి రాజేంధ్రప్రసాద్, పొలాస పౌలాస్తేశ్వరా స్వామి ఆలయ చైర్మన్ కొండల్ రావు తదితరులసమక్షంలో కార్యవర్గం ప్రమాణ స్వీకారం వేద మంత్రోచ్చారణల మధ్య అట్టహాసంగా జరిగింది.

ఈ సందర్బంగా మృత్యుంజయం మాట్లాడుతూ…

బ్రాహ్మణులు సమాజహితం కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. జగిత్యాలలో సంఘ భవనం నిర్మాణానికి నావంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. సంఘాలు ఎన్ని ఉన్న మన సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బ్రాహ్మణులు దేవుడికి భక్తులకు సహాయకారిగా పనిచేస్తారని పొలాస పౌలాస్తేశ్వర ఆలయ చైర్మన్ కొండాల్ రావు అన్నారు. దేవాలయానికి వెళ్లిన భక్తులు తామే అర్చన చేసి, హారతి ఇచ్చుకోలేరని ఇవన్నీ అర్చకులు చేస్తారని అందుకే బ్రాహ్మణులు సహాయకులని పేర్కొన్నారు. కార్యవర్గం సభ్యులను, అతిథులను ఘనంగా సన్మానించారు. వేణుగోపాల చార్య కౌశిక చేతులమీదుగా శోభకృత్ నామ సంవత్సరం పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మోతే ఉమాకాంత్ శర్మ, ఉపాధ్యక్షులు బండపెల్లి కార్తిక్ శర్మ, నమిలకొండ సాకేతా, ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల కార్తిక్ శర్మ, కంజర్ల అనంతాచార్యులు, రాజేందర్ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ,నమిలకొండ చంద్ర శేఖర్, విషు శర్మ, శంకర్ శర్మ, గణపతి శర్మ, వేణుమాధవ్,కళాశ్రీ గుండేటి రాజు,
బొడ్డు వనిత, జ్యోతి, జయ, సుహాసిని, దేశాయ్, దినేష్, రామన్న, కేశవరెడ్డి,తవుటు రామచంద్రం,పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు.