శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణానికి జగిత్యాల జిల్లాలోని పలు ఆలయాలు రంగు రంగుల విద్యుద్దిపాల అలంకరణతో ముస్తాబాయ్యాయి. గురువారం వివిధ ఆలయాల్లో రాములోరి… కళ్యాణనికి నిర్వాహకులు, భక్త బృంధాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. వేసవి కాలం దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చలువ పందిల్లు, త్రాగునిటి వసతులు కల్పించారు. జగిత్యాల ధరూర్ క్యాంప్ లో శ్రీరామనవమి ఊత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

జగిత్యాల పట్టణంలోని మార్కండేయ ఆలయం, కొండగట్టులో, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, మేడిపల్లి, రాయికల్, సారంగాపూర్, గొల్లపల్లి, బుగ్గారం, చందయ్యపల్లె, బతికేపల్లి, మల్యాల, కొడిమ్యాల, సారంగాపూర్, దొంతాపూర్ తదితర పట్టణాలు, గ్రామాల్లో ఆలయ కమిటీలు సీతారామ కళ్యాణం జరుపడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణనికి పెద్ద సంఖ్యలో హాజరయ్యే భక్తులకోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

చిన్నగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో….

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్, లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డు వద్ద చిన్నగట్టుపై వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారాముల కళ్యాణన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చిట్ల అంజన్న తెలిపారు. వేసవికాలం దృష్ట్యా గుట్టపైన భక్తుల సౌకర్యార్థమై చలువ పందిల్లు వేశామని, తాగునీటి వసతిని కల్పించామని తెలిపారు. గురువారం ఉదయం 11.05 నిమిషాలకు జగిత్యాలకు చెందిన ప్రముఖ జ్యోతి, వాస్తు శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబీ వేణుగోపాల చార్య కౌశిక పర్యవేక్షణలో వేద బ్రహ్మనుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని జరుపడానికి అందంగా అలంకరించిన ప్రత్యేక వేదికను ఏర్పాటుచేశామని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో జరిపామని అంజన్న వివరించారు. భక్తులు అధికసంఖ్యలో సకాలంలో హాజరై రాములోరి కళ్యాణన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చిట్ల అంజన్న కోరారు. భక్తులకు భోజనవసతి కల్పించామని వివరించారు.