సన్మార్గంలో నడుస్తూ ధర్మాన్ని కాపాడాలి – లలితామాత ఆలయ పౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప
జగిత్యాల జిల్లా
పొలాస
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను పెంపోందించుకుని సన్మార్గంలో నడస్తూ ధర్మాన్ని కాపాడాలని 108 శ్రీ చక్ర సహిత పొలాస లలితామాత ఆలయ ఫౌండరి ట్రస్టీ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య అన్నారు.
జగిత్యాల రురల్ మండలం పొలాస 108 శ్రీ చక్ర సహిత లలితామాతా ఆలయంలో ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ చెల్లం స్వరూప ఆధ్వర్యంలో మణిద్విపవర్ణన, కుంకుమర్చన వేడుకలను మహిళలు ఘనంగా జరిపారు. లలితమాత అమ్మవారి గుడిలో 108 శ్రీచక్రాలను ప్రతిష్టించగా సుహాసినిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా సుహాసినులు మణిద్విప వర్ణన పారాయణం భక్తి శ్రద్ధలతో గావించారు.
ప్రతి బుధవారం ఆలయంలో మహిళా భక్తులు లలిత మాతకు వివిధ రకాల పూలు, పండ్లు సమర్పించి భక్తి శ్రద్ధలతో లలితమాత సహస్ర నామ పారాయణం చేశారు మహిళలు అమ్మవారి భక్తి పాటలతో ఆప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఈసందర్బంగా ఫౌండరీ చైర్మన్ చెల్లం స్వరూప భక్తులనుద్దెశించి మాట్లాడుతూ …

అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని, లలితమతాను భక్తితో కొలవాలన్నారు. ఆధ్యాత్మికతను పెంపోందించి సమాజంలో భక్తిభవాన్ని అలవర్చడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దొహధపడుతయని స్వరూప అన్నారు.
ఆలయంలో ప్రతి వారం లలితామాత సహస్రనామా , మాణిద్విపా వర్ణన పారాయణం మహిళలచే నిర్వహిస్తున్నామని దీనికి మంచి స్పందన వచ్చిందన్నారు. మార్చి 10 న లలితమాత,108 శ్రీచక్రాలను భక్తి శ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వేణుగోపాలచార్య కౌశిక ఆధ్వర్యంలో రుత్వికులు, వేల మంది భక్తుల సమక్షంలో ప్రతిష్టాపన చేశామని సహకరించిన వారందరికీ స్వరూప కృతజ్ఞతలు తెలిపారు. లలితమాత ఆలయంతో పాటు పురాతన పౌలాస్తేశ్వర స్వామి, సహస్ర లింగాల ఆలయం, సాయిబాబా ఆలయం, అయ్యప్పా ఆలయాలతో పొలాసకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని స్వరూప చెప్పారు.
ఈ కార్యక్రమంలో శైలజ, పెద్ది అర్చన, అనిత, హేమ, వనజ, శ్రావణి, జయప్రద, అరుణశ్రీ, ప్రసన్న, కళావతి, తదితరులు పాల్గొన్నారు.