జగిత్యాల జిల్లా కేంద్రం
మార్చి 31,2023
జగిత్యాల కేంద్రంలోని కృష్ణానగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత వారం రోజులుగా వైభవంగా సాగిన సాయి నామ సప్తహం శుక్రవారంతో ముగిసింది. అనంతరం 1008 కలశ గంగాజలంతో సాయిబాబా మూలవిరట్టుకు వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ, వేణు మాధవ చార్య, రాజేశ్వర శర్మ, సంజయ్ లతో శాత్రోక్తకంగా అభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్న దానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్. సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, ఎలుగందుల సత్యనారాయణ, మార కైలాసం, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఒద్దినేని పురుషోత్తం రావు, అయిల్నేని రాంకిషన్ రావు, గుండేటి రాజు, చెట్ల చంద్రశేఖర్, నీలం దశరథ రెడ్డి, కంచి కిషన్, తవుటు రవి చంద్ర, పంజాల తిరుపతి గౌడ్త, సామాజిక కార్యకర్త తవుట్ రామచంద్రం, తిరుపతి, కంచి కిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.