అప్రమత్తత ద్వారానే అగ్నిప్రమాధాలు నివారించవచ్చు…
ప్రజలను ఆకట్టుకున్న అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు…
జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 15,2023
వేసవికాలoలో అగ్నిప్రమాదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే వాటిని నివారించవచ్చని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 1944 లో ఏప్రిల్ 14 న జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది ఫైర్ మెన్ లు మరణించగా వారి జ్ఞాపకార్థం నేషనల్ ఫైర్ సర్వీస్ డే సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 20 తేది వరకు అగ్నిమాపక వారోత్సవాలను జరుపుతున్నామని అందులో భాగంగా వారోత్సవాల పోస్టర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఫైర్ అధికారి కొమురయ్య, సిబ్బందితో కలిసి శనివారం ఆవిష్కరించారు. అగ్నిమాపక సిబ్బంది జగిత్యాల పాత బస్టాండ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంబవిస్తే ఎలా
నివారించవచ్చో ప్రజలకు అవగాహనా కల్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…
అగ్నిప్రమాదాలు నివారించడంలో అగ్ని మాపక శాఖపాత్ర కీలకమైoదన్నారు. ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ విషయం లో ప్రజలకు అవగాహన అవసరమని చెబుతూ వేసవిలో అధిక ఉష్నోగ్రతలతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, పొగతాగడంలో జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే గడ్డివాములు, తాటి, ఈత వనాలు, అడవులు కాలిపోయే ప్రమాదముందని వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏదైనా అగ్నిప్రమాదం సంబవిస్తే వెంటనే 101 నంబర్ కి ఫోన్ చేస్తే అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రమాదాలని నివారిస్థారని వివరించారు. అగ్ని ప్రమాదాలు నివారించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చిందని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి కొమురయ్య, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ డా. బోనగిరి నరేష్, మున్సిపల్
కౌన్సిలర్లు ముస్కు నారాయణరెడ్డి, చుక్క నవీన్, మున్సిపల్ డిఈ రాజేశ్వర్, కార్మిక విభాగం అధ్యక్షలు తొలిప్రేమ శ్రీనివాస్, మతీన్, వంశీ బాబు, అజార్, లక్ష్మి నారాయణ, దయాల మల్లారెడ్డి, నాయకులు ఆడువాల లక్ష్మణ్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.