మెదక్ జిల్లా
ఏప్రిల్ 21, 2023
✍️భైరవ్ రెడ్డి

పవిత్ర రంజాన్ మాసం ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈద్ ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…

ముస్లింలు అందరు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారని, రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మార్పు చెందుతారని అన్నారు.

ఈ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని అన్నారు. సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే రంజాన్ పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని, పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.