మెదక్ జిల్లా కేంద్రం
మే 1, 2023
✍️భైరవ్ రెడ్డి

క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, ప్రభుత్వం కూడా క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిస్తున్నదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 15 ప్రాంతాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి అధికారులు, వివిధ క్రీడల కోచ్ లు, పీఈటీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 1 నుండి 31 వరకు నిర్వహించు క్రీడా శిబిరాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న 8,9,10 తరగతులకు చెందిన విద్యార్థిని ,విద్యార్థులకు వంద మందికి తగ్గకుండా ప్రతి రోజు రెండు గంటలు ఉదయం, 6 నుండి 8 లేదా సాయంత్రం 4 30 నుండి 6. 30 గంటల వరకు శిక్షణ ఇవ్వాలని వ్యాయమ ఉపాధ్యాయులు, కోచ్ లకు సూచించారు.

జిల్లాలోని వడియారం, , చీకోడ్ లింగాయపల్లి, కోడెపాక, వెల్దుర్తి, నార్సింగి, రంగంపేట, టేక్మాల్, మనోహరాబాద్, బజరంపేట్, తూప్రాన్, ట్.మాందాపూర్, చేగుంట, రామాయంపేట లో నిర్వహించే శిబిరాలలో వాలీబాల్, కబడ్డీ, కరాటే, బేస్ బల్, హ్యాండ్ బాల్ బాల, సాఫ్ట్ బాల్, రగ్భి క్రీడలలో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. క్రీడాకారుల అభివృద్ధి మేరకు చక్కటి శిక్షణ ఇస్తూ జిల్లా,రాష్ట్ర స్థాయిలో రాణించేలా కృషి చేయాలన్నారు. విద్యార్థులను సమీకరించేలా చూడవలసినదిగా డీఈఓ, ఏం ఈ ఓ , మండల నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శిబిరానికి వచ్చే విద్యార్థులకు స్నాక్స్, నీటి వసతి కల్పిస్తామన్నారు. ఇట్టి శిబిరాలలో స్పందన బాగుంటే నెల రోజల పాటు కొనసాగిస్తామని, లేకుంటే మరో మండలంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కోచ్ లకు స్పోర్ట్స్ మెటీరియల్ ను కలెక్టర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన,క్రీడల అధికారి నాగరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, మండల విద్యాధికారులు నీలకంఠం యాదగిరి, బుచ్చా నాయక్, మండల నోడల్ అధికారులు,, శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.