మెదక్ జిల్లా
రామాయంపేట
✍️భైరవ్ రెడ్డి
రామాయంపేటపై సిద్దిపేట నేతల కుట్ర
అన్నీ వనరులున్నా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు దక్కని మోక్షం
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంపై సిద్దిపేట నేతలు కుట్ర చేసి అభివృద్దిని అడ్డుకుంటున్నారని, అందులో భాగంగానే అన్నీ వనరులున్నా రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా గుర్తించడం లేదని తెలంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిథులు చౌదరి సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ ధ్వజమెత్తారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ జరుగుతున్న రిలే నిరాహాల దీక్ష శిభిరానికి కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారంనాడు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
మెదక్ అభివృద్ది కుంటుపడిందని, ఇక్కడ ఏర్పాటు కావల్సిన కార్యాలయాలు, సంస్థలు సిద్దిపేటకు తరలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట దొరల చేతిలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బంధీ అయ్యిందన్నారు. మెదక్ అభివృద్ది తిరగోమన దశలో ఉందన్నారు. ఒకనాడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామాయంపేట ఉనికిని ప్రస్తుత పాలకులు ప్రశ్నార్థకం చేశారన్నారు. రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటు ప్రక్రియలో తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రామాయంపేట ప్రజల న్యాయమైన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మద్దతు తెలుపుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు సుప్రభాత రావు గారు పీసీసీ సభ్యులు మేడం బాలకృష్ణ గారు రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి చిన్న శంకరంపేట్ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ ఎంపిటిసి ఫోరమ్ల అధ్యక్షుడు శివకుమార్ ఎంపీటీసీలు ప్రసాద్ గౌడ్ , నాగులు స్వామి నార్సింగ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రొయ్యల పోచయ్య రామాయంపేట మాజీ పట్టణ అధ్యక్షుడు దాకి స్వామి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దోమకొండ యాదగిరి కుమార్ సాగర్ వెంకట గుడాల లింగం మోతుకు రాజు మడూరి నవీన్ పర్వతాపూర్ చందర్ కాంగ్రెస్ యువ నాయకులు ధర్మారం శ్రీకాంత్ రెడ్డి రెడ్డమైన నరేష్ దాకి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.