ధన్వoతరి ఆలయంలో పంచసూక్త అరుణ హోమాన్ని వేద బ్రహ్మనోత్తములు ఘనంగా నిర్వహించారు.

జగిత్యాల సమీపంలోని చింతకుంట చెరువు వద్ద 108 స్తంభాలతో నిర్మాణమైన సూర్య భగవాన్ మహాలక్ష్మి సహిత, శ్రీ ధన్వంతరి దేవాలయం, పంచమ వార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం పంచసూక్త అరుణ హోమం జరిగింది.

అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. నేడు ధన్వంతరి కళ్యాణo ఉంటుందని, కళ్యాణం అనంతరం, అన్నదాన కార్యక్రమం ఉంటుందని, నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజన్న , పాల్తేపు శంకర్, గట్టు రాజేందర్, తవుటు రామచంద్రం, విద్యాసాగర్ రావు, ఆలయ అర్చకులు చిలక ముక్కు నాగరాజు ఆచార్య, విష్ణు ఆచార్య, ఫణిమాధవాచార్య, మాతలు ,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.