జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుమాల రాజ్ కుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డా.బి.ఆర్. అంబెడ్కర్ గారి 132వ జయంతి అదే విదంగా 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ, బాబు జగ్జీవన్ రామ్ గార్ల జయంతి సందర్భంగా దళితుల బహుజనులు హక్కులు, అభివృద్ధి మరియు అంబెడ్కర్ ఆయాశయాల కొరకు కృషి చేసిన వారికి అవార్డులు అందజేయగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా దుమాల రాజ్ కుమార్ కు అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ…

ఎస్సి ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణకు ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయడం, దళితుల, బహుజనులు హక్కులకు,సమస్యలకు,ఎస్సి ఎస్టీ కేసుల్లో అండగా నిలబడటం, అంబెడ్కర్ ఆయాశయాల కొరకు పాటు పడినందుకు రాష్ట్ర ఉత్సవ కమిటీ అవార్డు అందించారని, వారికి జై భీమ్ లు,అవార్డు నాపై మరింత బాధ్యత పెంచింది అని అన్నారు.

కార్యక్రమంలో దుమాల గంగాధర్, దుమాల రాజాం, కాన్సిలర్ నవీన్, గుమ్ముల అంజయ్య తదితరులు పాల్గొన్నారు