కిశోర బాలికలలో రక్తహీనత, బాల్య వివాహాలు అరికట్టడంపై జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అధికారులకు శిక్షణ ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా యునిసెఫ్ ప్రతినిధులకు సూచించారు.

శుక్రవారం తన ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి జిల్లాలో కిశోర బాలికలలో రక్తహీనత, బాల్య వివాహాలు అరికట్టడం పై పనిచేయుటకు ముందుకువచ్చిన యూనిసెఫ్ కు చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రతినిధులతో శుక్రవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి సహకారంతో ముందుగా జిల్లాలో ఉన్న కెజిబివి ప్రత్యేకాధికారులు 15 మందికి శిక్షణ ఇచ్చుటకు రూపొందించవలసినదిగా సూచించారు. శిక్షణ పొందిన అధికారులు విద్యాలయంలో విద్యార్థినులకు, ఇతర అధికారులకు తిరిగి శిక్షణ ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సహకారంతో అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలలో ఇట్టి కార్యక్రమాలపై సిబ్బందికి తగు శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని, జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారమందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధులు కృష్ణ, విద్యుల్లత, డీఈఓ రాధాకిషన్, డిఎమ్ అండ్ హెచ్ ఓ ,చందు నాయక్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.