గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విష్ణుప్రియ రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించి తాటిపల్లి గురుకులనికే పేరు తెచ్చింది. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం అర్పపల్లి కి చెందిన పాలడుగు విష్ణుప్రియ ఇంటర్ ఫలితాల్లో మల్యాల మండలం తాటిపల్లి గురుకులంలో బైపీసీ చదివి 986 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది.

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల విష్ణుప్రియ పేరెంట్స్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీలత, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం.కిషన్ రెడ్డిలు అభినందనలు తెలిపారు.