జగిత్యాల జిల్లా
మే 20,2923
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా జగిత్యాల మండల స్థాయిలో నిర్వహించబడ్డ కబడ్డీ పోటీలలో పొలాస స్కూల్ జట్టు ద్వితీయ స్థానాన్ని గెలుచుకుంది.
అదేవిధంగా పొలాస గ్రామానికి చెందిన పడాల యశ్వంత్ 400 మీటర్ల పరుగు పందెంలో, 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానాలను పొందారు. ఈ క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలలో సైతం పాల్గొంటారు. జగిత్యాల అదనపు కలెక్టర్ మంద మకరంద చేతుల మీదుగా క్రీడాకారులు బహుమతులను అందుకున్నారు.
గెలిచిన క్రీడాకారులను పిఈటీ దయాకర్, ప్రధానోపాధ్యాయులు నరేందర్ లు అభినందించారు. బహుమతి ప్రధానోత్సవంలో ఎంఈఓ శ్రీమతి గాయత్రి , ఎంపీడీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.