మాజీ సర్పంచ్ ల సంక్షేమానికి
200 కోట్ల నిధులు కేటాయించాలి
హెల్త్ కార్డులిచ్చి కార్పొరేట్ వైద్యం అందించాలి – రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కూ మాజీ సర్పంచుల వినతి
ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవి కాలంలో గ్రామాలాభివృద్ధికి, ప్రజలకూ మౌళిక వసతుల కల్పన, ప్రజా సంక్షేమానికి పాటుపడి ఆర్థికంగా క్షిణించిన మాజీ సర్పంచ్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపెల్లి వినోద్ కుమార్ ను మాజీ సర్పంచ్ ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య కోరారు.
ఈమేరకు సోమవారం కరీంనగర్ లో వినోద్ కుమార్ కు సమస్యలు పరిష్కరించేలా చూడాలని మాజీ సర్పంచ్ లు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా బొడ్డు దేవయ్య, కరీంనగర్, జగిత్యాల, పెద్దపెల్లి జిల్లాల అధ్యక్షులు పుప్పాల రఘు, మచ్చ నారాయణ,వేల్పుల మల్లికార్జున రావు, జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి ఎన్నం కిషన్ రెడ్డి లు మాట్లాడుతూ… ప్రజా సమస్యలు, గ్రామభివృద్దె ధ్యేయంగా పనిచేసి అప్పుల పాలై మానసికంగా క్రుంగిపోయిన ప్రభుత్వాలు మమ్ములను పట్టుంచుకోవడంలేదని వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో మేము అధికారంలో ఉండి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్బవం కోసం అలుపెరుగని పోరాటం చేశామని గుర్తుచేశారు.గత 50 ఏళ్లుగా మాజీ సర్పంచ్ లను ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, తెలంగాణ వ్యాప్తంగా గ్రామానికి ముగ్గురు లేదా నలుగురు మాజీ సర్పంచులున్నారని వారి పరిస్థితుల పట్ల అధ్యయనం చేసి ఆదుకోవాలన్నారు. మాజీ సర్పంచ్ ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల నిధులు కేటాయించాలని, హెల్త్ కార్డులు అందించి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని, భూమి లేని వారికి ఎకరం భూమి ఇవ్వాలని, ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలోని మాజీ సర్పంచులందరికి 5 వేల గౌరవ పెన్షన్ అందించాలని దేవయ్య, రఘు, నారాయణ, కిషన్ రెడ్డిలు కోరారు.
వీరితో పాటు మాజీ సర్పంచ్ ల సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద శంకర్, చందుపట్ల పరంధాములు, గోపగాని సమ్మయ్య, మ్యాకల కార్తీక్ యాదవ్, బొల్లె గంగారాం, బొక్కల విరారెడ్డి, కందునూరి ప్రమోద్ రావు, ఆది మధుసూదన్ రావు తదితరులున్నారు.