ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాకి సంబంధించి తాజాగా కొరటాల శివ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర.. ఆ పాత్ర దృష్టిలో సాగే మారణహోమం, అలాగే ఎన్టీఆర్ పాత్రలోని వేరియేషన్స్ ఇలా సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని.. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు మల్టీ పర్సనాలిటీ టైప్ క్యారెక్టరైజేషన్ ఏదో ఉంటుందని కూడా వినిపిస్తోంది. మరి ఈ వార్త నిజం అయితే.. ఎన్టీఆర్ నుంచి మరో అద్భుతాన్ని ఆశించొచ్చు.

ఎంతైనా కొరటాల శివ, ఈ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.