దాదాపు 205 అడుగులు ఎత్తులో ప్రయాణికులు ఆగిపోయారు. దీంతో వారంతా బిక్కచచ్చి పోయారు. సాఫీగా సాగిపోతూ వచ్చిన రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి 205 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తూ వచ్చిన వారంతా ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ఘటన అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని శాన్‌డస్కీలోని అమ్యూజ్‌మెంట్ పార్కులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే…

ఈ పార్కులో ఉన్న రోలర్ కోస్టర్ 205 అడుగుల ఎత్తులో ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో రైడ్ ఎంజాయ్ చేద్దామని దానిపైకి ఎక్కినవారు ప్రాణభయంతో వణికిపోయారు. సాంకేతిక కారణాలతో ఇది ఆగిపోయింది. దీంతో పైన చిక్కుకున్న వారిని జాగ్రత్తగా కిందికి దించారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడటంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.