ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగము


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: నిజ శ్రావణ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: పాడ్యమి సా.04:11 వరకు
తదుపరి విదియ

వారం: గురువారం – బృహస్పతివాసరే

నక్షత్రం: మఘ రా.07:52 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: పరిఘ రా.07:21 వరకు
తదుపరి శివ

కరణం: బవ సా.04:11 వరకు
తదుపరి బాలవ రా.తె.05:09 వరకు
తదుపరి కౌలువ

వర్జ్యం: ఉ‌.06:33 – 08:19 వరకు
మరియు రా.తె.04:42 – 06:28 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:13 – 11:03
మరియు ప‌.03:17 – 04:08

రాహు కాలం: ప‌.01:55 – 03:30

గుళిక కాలం: ఉ‌.09:09 – 10:44

యమ గండం: ఉ‌.05:59 – 07:34

అభిజిత్: 11:55 – 12:45

సూర్యోదయం: 05:59

సూర్యాస్తమయం: 06:40

చంద్రోదయం: ఉ‌‌.06:34

చంద్రాస్తమయం: రా.07:30

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: దక్షిణం

సింహ సంక్రమణం

విష్ణుపదపర్వకాలము‌

మఘ‌ కార్తె

కృతయుగాన్త‌

నిజశ్రావణ‌ మాసారంభం‌

నక్త‌ వ్రతారంభం

ఏక భుక్త వ్రతారంభం

మౌన వ్రతారంభం

బృహస్పతి పూజ

శ్రీ మదన్‌లాల్ ధింగ్రా‌
స్మృతి దినం

శ్రీ కాటేస్వామిజీ‌ జయంతి

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
స్మృతి దినం

పవిత్రరోహణోత్సవారంభం‌

చంద్రదర్శనం


నేటి రాశి ఫలాలు


మేషం

ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. పంచమ చంద్ర బలం అనుకూలించటం లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.


వృషభం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.


మిధునం

శుభ సమయం. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్
హృదయ పారాయణ మంచిది.


కర్కాటకం

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ద్వితీయ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అలసట చెందకుండా సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.


సింహం

మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.


కన్య

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.


తుల

అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.


వృశ్చికం

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనః స్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.


ధనుస్సు

ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. | సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. నవమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అనవసర విషయాల పట్ల కాలాన్ని వృథా చేయకండి. మనఃశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.


మకరం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చురుగ్గా పనిచేయాలి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. ఒత్తిడిని
దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యానం చదివిత మంచిది.


కుంభం

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో సభ్యుల కుటుంబ సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.


మీనం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అవసరానికి ఆర్థికసాయం లభిస్తుంది. సమయపాలనతో పనులు పూర్తిచేస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.


Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)