సముద్రం ఎన్నో జీవులు ఆవాసం… రంగురంగుల చేపలు, స్టార్ ఫిష్‌లు, ఆల్చిప్పలు, హైడ్రాలు, షార్క్ చేపల లాంటి కొన్ని జీవులు, మరికొన్ని జీవులేమో చూడటానికి సాహసించలేనంత వికృతంగా ఉంటాయి.
వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్‌లో భాగంగా సముద్రంలోకి వెళ్లిన పియట్రో ఫోర్మిస్ అనే అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్.. వికృత ముఖంతో ఉన్న ఈ దెయ్యం చేపను తన కెమెరాలో బంధించాడు.
ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పియట్రో ఫోర్మిస్ సముద్రం లోపలికి వెళ్లిన తనకు దూరం నుంచి అది ఒక వాటర్‌ఫాల్ మాదిరిగా కనిపించిందని, దగ్గరికి వెళ్లి చూస్తే ఓ భారీ చేప తనను తాను ఇసుకలో కప్పుకుని పడుకున్నట్లు కనిపించిందని, ఆ చేప ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారిందన్నాడు.