గురువారం రాత్రి నుండి హాంకాంగ్ ఈశాన్య భాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది.

140 సంవత్సరాల తర్వాత ఈ భారీ వర్షాలు, వరదలతో హాంకాంగ్‌ వీధులు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్‌లు నీట మునిగిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి.

హాంకాంగ్ లో రాత్రి 11 గంటలకు 158.1 మిల్లీమీటర్లు (6.2 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ అత్యధిక “బ్లాక్” అలెర్ట్ హెచ్చరికను జారీ చేసింది.