రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యా యని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు.

ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది’ అని తెలిపారు.