బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కొద్దిరోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. దీంతో ఆమె అదృశ్యంపై ఊహాగానాలు, ప్రచారాలు జోరందుకున్నాయి.
ఆమె కోమాలో ఉన్నారని కొందరు.. యువరాజు విలియం అఫైర్ మరో కారణమని చర్చించుకుంటున్నారు. 3 నెలలుగా ఆమె ఎవరికీ కనిపించలేదని న్యూయార్క్ పోస్ట్ కూడా కథనం ప్రచురించింది. యువరాజు మామ కేట్ మిస్సింగ్ పై అనుమానం వ్యక్తం చేశారు. నెట్టింట దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.