జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 18,2023

కరీంనగర్ మాజీ ఎంపి జువ్వాడి చొక్కారావు పెద్ద కూతురు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సతీమణి రాధిక తల్లి చెన్నాడి విజయ అనారోగ్యంతో మరణించగా మంగళవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆమె అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట జగిత్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్, బోయినిపెల్లి ప్రశాంత్ రావు, తదితరులున్నారు.