మంచిర్యాల జిల్లా
తాండూర్ (మం)
ఏప్రిల్ 21, 2023
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెలయిపల్లి, నర్సాపూర్, ఎంవీకె-3 గ్రామా లలో మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసిపి సదయ్య , సీఐ జగదీష్ ఆధ్వర్యంలో తాండూర్ ఎస్ఐ సమ్మయ్య పోలీస్ సిబ్బంది తో కలిసి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా నెలయిపల్లి, నర్సాపూర్, ఎంవికే-3 గ్రామం యువతకు క్రికెట్ కిట్స్ అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ గారు మాట్లాడుతూ…
యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులు కాకుండా ఏజెన్సీలో ఇలాంటి కార్యక్రమాలు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని భవిష్యత్తులో క్రీడలతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని చిన్నప్పటి నుండి క్రీడల పట్ల అవగాహనా కలిగి ఉండాలని దీనితో ఆరోగ్యంగా ఉండి ఉన్నత లక్ష్యాలు సాధిస్తారని పోలీస్ వారు యువతకు ఎల్లవేళలా సహకరిస్తాయని యువత ను ప్రోత్సహించటం లో పోలీస్ లు ముఖ్య పాత్ర వహిస్తాయని యువకులు గంజాయి, జూదం వంటి చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసు ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి కోరినారు.
మీ గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని, అసాంఘిక శక్తుల గురించిన ఎటువంటి సమాచారమైనా పోలీసులకు అందించాలని ఈ సందర్భంగా ఎస్ఐ సమ్మయ్య యువకులకు పిలుపు నిచ్చారు.