విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి…
అలరించిన “సూర్య” గ్లోబల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 22,2023
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలు అధిరోహించేలా సూర్య గ్లోబల్ పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ పాటుపడుతుందని కరస్పాండెంట్ బోయినిపెల్లి శ్రీధర్ రావు అన్నారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక సుమంగళి గార్డెన్ లో శనివారం నిర్వహించిన సూర్య గ్లోబల్ హై స్కూల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు అంబరాన్నాంటాయి. నర్సరీ నుంచి హై స్కూల్ స్థాయి వరకు విద్యార్థులతో పాటుగా వారి పోషకులు ఈ వేడుకలకు హాజరవడం వార్షికోత్సవానికే ప్రత్యేక పండగ అనుభూతికి సాక్ష్యంగా నిలిచింది. ఈ వేడుకల్లో చిన్నారులచే ప్రదర్శించిన పలు నృత్య, నాటిక, సాంస్కృతిక, కళా ప్రదర్శనలు అహుతులను ఎంతగానో అలరించాయి.
ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండేట్ శ్రీధర్ రావు మాట్లాడుతూ…
విద్యార్థులకు విద్యతో పాటుగా, విభిన్న రంగాల్లో సూర్య గ్లోబల్ రాణించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీస్తూ, నిరంతరం విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఏకైక విద్యా సంస్థ సూర్య గ్లోబల్ అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రశాంత్ రావు , హరి చరణ్ రావు, రజిత రావు, మౌనిక రావు, సుమన్ రావ్, అజిత రావు, హరి చరణ్ రావు తో పాటు ఉపాధ్యాయ బృందం, తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.