మెదక్ జిల్లా
నిజాంపేట మండలం
ఏప్రిల్ 24,2023
✍️భైరవ్ రెడ్డి

నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు ఆయనకు శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…

శ్రీ బీరప్ప ఆలయంలో బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం శుభదాయకమని ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి తో పాటు నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.