మెదక్ జిల్లా
నిజాంపేట మండలం
ఏప్రిల్ 24,2023
✍️భైరవ్ రెడ్డి
నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ ఆర్గనైజింగ్ సంస్థ అధ్యక్షులు మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మీడియాతో మాట్లాడుతూ…
చల్మెడ గ్రామము మరియు నిజాంపేట మండలములో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.
బీరప్ప ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవంలో మైనంపల్లి రోహిత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రోహిత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు