మెదక్ జిల్లా కేంద్రం
మే 02,2023
✍️భైరవ్ రెడ్డి

మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారిని కాంటాక్ట్ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజున కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ఫైల్ పైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం చేసి రెగ్యులరైజ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధరేకరణ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగులు సన్మానించారు, అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు, జీవితాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి హరీష్ రావు గారికి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి రుణపడి ఉంటామన్నారు. ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ అధ్యాపకులకు గ్రీన్ పెను ను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జిల్లా సిజిఐ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్, సెక్రటరీ ఫర్జానా జబీన్, అధ్యాపకులు స్వర్ణలత, జ్యోతి, సరళ, జహీరా, కవిత, సంతోష్, వసంత్, మల్లన్న, వేణు గోపాల్, అశ్విన్, రాజు,లక్ష్మీనారాయణ, ఉస్మాన్ అంజయ్య, అశోక్, శివ మదన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.