జగిత్యాల జిల్లా
మే 3,2023
పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన స్వామి
అరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలకు వరి, మొక్క జొన్న, నువ్వు, మామిడి పంటలు దెబ్బతిన్నాయని,
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 40 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు గజ్జల స్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బుధవారం నందగిరి, రాంబధ్రునిపల్లె, ఎల్లాపూర్ పెగడపల్లితో తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని గజ్జల స్వామి రైతులతో కలిసి సందర్శించారు.ఈసందర్బంగా స్వామి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి, మొలకత్తిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.
పెగడపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లో వడ్లు, వరికి జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకొని సంబందిత అధికారులతో ఫోన్లో మాట్లాడి నష్టపరిహారం తక్షణమే ప్రభుత్వం ఎకరాకు 40000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో ని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అరబెట్టిన వడ్లను పరిశీలించి కష్టాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి న్యాయం జరిగేవరకు పోరాడుతుందని స్వామి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యాళ్ల నంది రెడ్డి,అయితవేని కొమురయ్య, కొండయ్య, రంగు మహేందర్, రవి, గంగయ్య, శేఖర్, రంగు శ్రీశైలం, దామోదర్, రాజయ్య,
మాజీ సర్పంచ్ ఎద్దు భూమయ్య కొమురయ్య పరశురాం లక్ష్మణ్ రాజు మల్లేశం శ్రీనివాస్ వెంకయ్య కుమార్ ఎంపీటీసీ అంజయ్య , పటేల్ సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, సుంకరి రవి, తౌటు గంగాధర్, రైతులు నెల్లి వీరమల్లు, అరకుట్ల కనకయ్య, రాజయ్య, సత్యనారాయణ రెడ్డి, మతమల్ల మల్లయ్య, తదితరులున్నారు.