మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 3 మే 2023,
*మనోజ్ కుమార్ పాండే*
*వాహనదారులు జర జాగ్రత్త*
బెల్లంపల్లి : బెల్లంపల్లి బాబు క్యాంపు బస్తీ లోని కల్వర్టు వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి వుంది. హనుమాన్ బస్తీ, బాబూక్యాంప్ బస్తీలను కలిపే ఈ కల్వర్టు రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా ప్రజలు ప్రమాదాలలో చిక్కు కోవడానికి ఆస్కారం ఏర్పడుతున్నది. ఎదురుదురు గా వాహనాలు రాలేని పరిస్థితి వుంది. కల్వర్టుకు రెండు వైపులా సైడ్ వాల్స్ లేకపోవడం వల్ల ఈ కల్వర్టు మీద నుండి రాకపోకలు సాగించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తూ పోతుంటారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కల్వర్టుకు రెండు వైపులా సైడ్ వాల్స్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
