నిర్మాణాలు చివరి దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ సముదాయంలో మిగిలిపోయిన చిన్న చిన్న పనులను ఈ నెలాఖరు నాటికీ పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి నర్సాపూర్ మునిసిపాలిటీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి పనులను సమీక్షిస్తూ 252 ఇండ్లలో నడుస్తున్న కిటికీలు,ఎలక్ట్రిఫికేషన్, పెయింటింగ్, ప్లంబింగ్ వంటి మిగిలిపోయిన చిన్న చిన్న పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తూ మౌలిక సదుపాయాలతో పాటు పరిసర ప్రాంతాలను చదును చేసి ప్రారంభానికి సిద్ధం చేయవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ వెంకట గోపాల్, తహశీల్ధార్ ఆంజనేయులు, ఎంపిడిఓ, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.