2023-24 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ లోని రామాంతపూర్ పబ్లిక్ స్కూల్ లో ఒకటవ తరగతి లో ప్రవేశానికై అదనపు కలెక్టర్ రమేష్ తన ఛాంబర్ లో లక్కీ ద్వారా ఎంపిక చేశారు. జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో తీసిన లక్కీ డ్రాలో అల్లాదుర్గ్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీవర్ధన్ ఎంపికయ్యారని రమేష్ తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య ను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థి, వారి తల్లిదండ్రులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సి అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్ గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.