2021-22 ఖరీఫ్ కు సంబంధించి పెండింగ్ ఉన్న 13 వేల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఈ నెలాఖరులోగా ఎఫ్.సి.ఐ. కు అందించడంత పాటు ప్రస్తుత యాసంగి ధాన్యాన్నివెంట వెంటనే దించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైస్ మిల్లర్లకు సూచించారు.
ఈ రోజు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి గత ఖరీఫ్ లో పెండింగ్ సీఎంఆర్, ప్రస్తుత యాసంగి ధాన్యం దిగుబడిపై మిల్లర్లకు, తహసీల్ధార్లకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…
ఇటీవల ఎఫ్.సి.ఐ. అధికారులతో సమావేశమై బియ్యం చేరవేయడంలో ఉన్న స్టెన్సిలింగ్, గన్ని సంచుల డబుల్ స్టిచ్చింగ్ వంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామని అన్నారు. కాబట్టి 2021-22 ఖరీఫ్ కు సంబంధించి పెండింగ్ ఉన్న ధాన్యాన్ని ప్రతి రోజు ఒక్కో రైస్ మిల్లర్ 58 మెట్రిక్ టన్నుల చొప్పున 30 రైస్ మిల్లర్లు ఎఫ్.సి.ఐ. ధాన్యం తరలించేలా వేగవంతం చేయాలని, లేకుంటే డిఫాల్టర్ జాబితాలో చేరడంతో పాటు 125 శాతం పెనాల్టీ చెల్లించవలసి ఉంటుందని, రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు . 2021-22 రబీకి సంబంధించి ప్రభుత్వం గడవు పొడిగించే అవకాశముందని అన్నారు. సి.ఏం.ఆర్. పరఫార్మన్స్ బాగున్నా వారికే ధాన్యం కేటాయిస్తామని అన్నారు. హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకొని ప్రస్తుతం వస్తున్న యాసంగి ధాన్యాన్ని త్వరత్వరగా దించుకొని ట్రక్ షీట్ ఇవ్వాలని, అకాల వర్షాలతో తల్లడిల్లుతున్న రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని అన్నారు. 35 బాయిల్డ్ రైస్ మిల్లులకు గాను ఇప్పటి వరకు 12 మిల్లుల వారే ధాన్యం దించుకున్నారని, నరసాపూర్, శివ్వంపేట వంటి ప్రాంతాలలో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలేదని ఫిర్యాదులొస్తున్నాయని అపవాదులను తావివ్వకుండా మిల్లులకువచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దించుకోవాలని, ప్రభుత్వ పరంగా సహాకారమందిస్తామన్నారు. తహసీల్ధార్లు కూడా ప్రతి రోజు రెండు మిల్లులను సందర్శించి సి.ఏం.ఆర్. రైస్ ను ఎఫ్.సి.ఐ. కి తరలిస్తుండడంతో పాటు హమాలీలు ఎక్కువగా పెట్టుకొని యాసంగి ధాన్యం దించుకునేలా రైస్ మిల్లర్లతో సమన్వయము చేసుకుంటా వి.ఆర్.ఏ. లను అప్రమత్తం చేయాలని సూచించారు. రైతులు కూడా తాళ్లు లేకుండా నాణ్యాతా ప్రమాణాల కనుగుణంగా ధాన్యం తెచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. అదేవిధంగా వర్షాలు తగ్గుముఖం పట్టినందున కొనుగోలు కేంద్రాలు సేకరణ ప్రక్రియ వేగవంతంగా, సజావుగా జరిగేలా నిర్వాహకులను అప్రమత్తం చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, తహసీల్ధార్లు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.