కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ కేంద్రం నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం మెదక్ మండలం మాచారం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ…

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని, తడిసిన ధాన్యం ఆరబెట్టి, తాళ్లు లేకుండా నాణ్యాతా ప్రమాణాలకనుగుణంగా తేవాలని సూచించారు. కేంద్రంలో అవసరమైన మరో ప్యాడి క్లినర్ యంత్రాన్ని వెంటనే పంపిస్తామని అన్నారు. కేంద్రం నిర్వాహకులు కూడా టాబ్ ఎంట్రీ త్వరితగతిన చేసి రైతులకు డబ్బులు ఖాతాలో పడేలా చూడాలన్నారు.