లలితా సహస్రనామ పఠనంతో అభీష్ట సిద్ధి

108 శ్రీ చక్ర సహిత లలితమాత ఆలయ ఫౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప

పొలాస ఆలయంలో ఘనంగా కుంకుమార్చన

జగిత్యాల జిల్లా
పొలాస

లలితా మాతా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అబీష్టసిద్ధి కలుగుతుందని పొలాసలో కొలువైన 108 శ్రీ చక్రసహిత లలితమాత ఆలయ ఫౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని శ్రీ లలితమాత అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.


ఆలయంలో శ్రీ లలితాసహస్ర నామ స్తోత్ర పారాయణం స్వరూప ఆధ్వర్యంలో భక్తులు, సుహాసినిలు భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం, మణిద్విప వర్ణన గావించారూ.
మహిళలు శ్రీచక్రాలకు కుంకుమార్చన చేశారు.


ఈ సందర్బంగా చెల్లం స్వరూప మాట్లాడుతూ…


అమ్మ కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని వేడుకున్నారు. అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామా పారాయణం చేయడం వల్ల అపారమయిన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.


నిత్యం లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారిని పూజిస్తే కార్యాసిద్ధి కలుగుతుందని పేర్కొన్నారు.మణిధ్విప వర్ణన చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని స్వరూప అన్నారు. కార్యక్రమానంతరం హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో పాంపట్టి రవీందర్ ,మార కైలాసం, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి,విజ్ఞన్ రవీందర్ రావు, వేముల కేశవ రెడ్డి ,చెల్లం సత్తయ్య, సుహాసినిలు పాంపట్టి సులోచన, పెద్ది అశ్విని, వుటూరి కళ్యాణి, పెద్ది అర్చన, లక్ష్మీ, సుజాత, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.