మేషం

ప్రయత్న కార్యసిద్ధి కలదు. మీ రంగాల్లో చక్కటి ఫలితాలను అందుకుంటారు. బంధువుల నుంచి ఆదరాభిమానాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో భరణి నక్షత్రం వారికి క్షేమం చేకూరుతుంది. ప్రయాణసిద్ధి ఉంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

వృషభం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైన అంశాల్లో రోహిణి నక్షత్రం వారికి మేలు చేకూరుతుంది. ఇష్టదేవతారాధన మంచిది.

మిధునం

చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ముఖ్య వ్యవహారాల్లో మనోధైర్యం సర్వప్రధానం. పంచమ చంద్ర సంచారం అనుకూలించలేదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. దుర్గాస్తుతి మంచిది.

కర్కాటకం

పట్టు వదలకుండా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. చంచల స్వభావంతో ఇబ్బంది పడతారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. చతుర్ధ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గాశ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహం

చక్కటి సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. తృతీయ స్థానంలో చంద్ర బలం అనుకూలిస్తోంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది.

కన్య

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. అలసట చెందకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

తుల

ఇష్టపడి పనిచేసి విజయసోపానాలను అధిరోహిస్తారు. మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీ ధ్యానం వల్ల అంతా మంచి జరుగుతుంది.

వృశ్చికం

గ్రహబలం తక్కువగా ఉంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు
దూరంగా ఉండాలి. నవగ్రహ స్తుతి మేలు చేస్తుంది.

ధనుస్సు

చక్కని కార్యసిద్ధి ఉంది. ముందస్తు ప్రణాళికలతో పనులు పూర్తవుతాయి. బంధు, మిత్రులతో ఆనందకరమైన లక్షణాలను గడుపుతారు. పెద్దల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి, మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.

మకరం

మంచి సమయం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు రావడం శ్రీవేంకటేశ్వరుని సందర్శించాలి.

కుంభం

పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నవమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. దుర్గారాధన శుభప్రదం.

మీనం

చేపట్టే పనుల్లో బద్ధకాన్ని రానీయకండి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. అష్టమ చంద్ర దోషం ఉంది. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దుర్గారాధన శుభప్రదం.