రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారని ప్రచారం జరుగుతుంది. సోమవారం నాడు చంద్రబాబుతో జైలులో తలైవా ములాఖత్ కాబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన రజనీకాంత్ ఆయనకు సంఘీభావంగా నారా లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. తన మిత్రుడు చంద్రబాబు పోరాటయోధుడు అని, ఇటువంటి పరిస్థితులను ఆయన దీటుగా ఎదుర్కొనగలరని లోకేష్ కు రజనీ ధైర్యం చెప్పారు.